వలపన్ని పట్టేసిన పోలీసులు..

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: చిత్తూరు (Chittoor) పట్టణం జనసంచారం లేని ప్రాంతాల్లో ప్రేమ జంటలను బెదిరించి నగలు, నగదు దోచుకున్న ఓ వ్యక్తిని శుక్రవారం చిత్తూరు వన్ టౌన్ పోలీసులు అరెస్టు (Police) చేశారు. నిందితుడు నుంచి రూ.1.20 లక్షల 12 గ్రాముల బంగారు నగలు, బైకును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పట్టణంలోని పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ వెనుక అటవీ ప్రాంతంలోని ఓ ప్రేమ జంటను బెదిరించి బంగారు నగలు, నగదు దోచుకు వెళ్లారనే ఫిర్యాదుతో చిత్తూరు వన్ టౌన్ సీఐ మహేశ్వర కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ప్రత్యేక బృందాలుగా నిందితుడి కోసం గాలించగా.. శుక్రవారం ఉదయం పీవీకేఎన్ డిగ్రీ కాలేజీ ((PVKN Degree College) వెనుక అటవీ ప్రాంతంలో చిత్తూరు కొంగరెడ్డిపల్లి కి చెందిన అకీల్ అనే యువకుని అరెస్టు చేశారు. నేరస్థులపై చిత్తూరు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని, ప్రజల భద్రతకు ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న ఆఫీసర్స్, ఐడి పార్టీ సిబ్బందిని చిత్తూర్ జిల్లా ఎస్.పి.తుషార్ డూడి, చిత్తూర్ డీఎస్పీ సాయినాథ్ అభినందించారు.

Leave a Reply