రామ పాల ఉత్పత్తిదారుల సంఘం చైర్మన్‌గా పురుషోత్తం

మోత్కూర్, ఆంధ్రప్రభ: మండలంలోని పాలడుగు-2 శ్రీరామ పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం (మదర్ డెయిరీ పరిధి) చైర్మన్‌గా మిడిదొడ్డి పురుషోత్తం వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా సంఘం నూతన డైరెక్టర్లుగా గునిగంటి విజయ, ముక్కెర్ల మహేష్ ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.

ఈ కార్యక్రమంలో సంఘం డైరెక్టర్లు యాస మాధవి, పులగం వెంకట్‌రెడ్డి, కందికట్ల అచ్చయ్య, వల్లపు వెంకన్న, బొడిగె యాదయ్య, సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, దడిపెల్లి వెంకటయ్య, గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ మర్రిపెల్లి యాదయ్య, సింగిరెడ్డి నరసింహారెడ్డి, అంతటి వెంకటయ్య, వల్లపు సైదులు, ముక్కముల దొనకొండ, బర్ల కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.