రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

జన్నారం, ఆంధ్రప్రభ: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని చెర్లపల్లికి చెందిన పంచెర్పుల శ్రీనివాస్ (46) బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. సమాచారం ప్రకారం, శ్రీనివాస్ మండల కేంద్రానికి వచ్చి రాత్రి సుమారు 7:30 గంటలకు స్కూటీపై స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా, స్థానిక ఎస్‌బీఐ సమీపంలోని ప్రధాన రహదారిపై స్కూటీ, ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రజితతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ తెలిపారు.