విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి
మండల విద్యాధికారికి వినతి పత్రం అందజేస్తున్న సామాజిక కార్యకర్త న్యాయ విద్యార్థి సయ్యద్ ఖలీమ్
కుంటాల, ఆంధ్రప్రభ : విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని కోరుతూ మంగళవారం సామాజిక కార్యకర్త న్యాయ విద్యార్థి సయ్యద్ ఖలీమ్ మండల విద్యాధికారి వట్టోలి ముత్యంకు విద్యాధికారి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆయన వినతి పత్రంలో కోరారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలల్లోని ఫీజులను నియంత్రించాలని, మండల వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు పాఠశాలలో తరగతుల వారిగా ఫీజులను అధిక మొత్తంలో వసూలు చేస్తున్నారని పాఠ్యపుస్తకాలు ఇతర సామాగ్రి అధిక ధరలకు అమ్మకుండా నియంత్రించాలని ఆయన వినతి పత్రంలో కోరారు. లేకపోతే ప్రైవేటు పాఠశాల యాజమాన్లపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఇష్టరాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు. అదే విధంగా విద్యకు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి శాఖపరమైన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
