Union Minister | విపక్షాల దుష్ప్రచారమే ఆందోళనకు కారణం

Union Minister | విపక్షాల దుష్ప్రచారమే ఆందోళనకు కారణం

Union Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఇంధనం కొరత ఉందనే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటోందని తెలిపారు.

మొదట ఆంధ్రప్రదేశ్‌లో సమస్య ఉత్పన్నమవడంతో అక్కడ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగిందని ఆయన చెప్పారు. ఆ ప్రభావంతో ఏపీ నుంచి వాహనదారులు పెద్ద సంఖ్యలో రావడంతో ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల్లో కొంత ఇంధన కొరత కనిపించిందన్నారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటోందని కిషన్‌రెడ్డి వివరించారు. సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

విపక్షాలు దుష్ప్రచారం చేయడం వల్లే ప్రజల్లో అనవసర భయాందోళనలు పెరిగాయని ఆయన ఆరోపించారు. వాస్తవాలను తెలుసుకుని ప్రజలు అపోహలకు లోనుకావద్దని సూచించారు.

Leave a Reply