ఉపాధి హామీ చట్టం పునరుద్ధరించాలి..
మునుగోడు, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విబిజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి పాత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఉపాధి హామీ చట్టం వల్ల గ్రామీణ పేదలకు ఉపాధి లభించడంతో పాటు వలసలు తగ్గాయని తెలిపారు.
కూలీలకు పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని, పని దినాలను పెంచి కనీస వేతనం అమలు చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలతో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు పని దినాలను పెంచి కూలి పెంపు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బండ శ్రీశైలం,ఫీల్డ్ అసిస్టెంట్ వల్లూరి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
