ఇంధన ధరల పెంపుతో సామాన్యులపై భారం..

మునుగోడు, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతోందని సిపిఐ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురుజ రామచంద్రం విమర్శించారు.ఈరోజు నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలకు నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు దేశంలో ఇంధన ధరలు ఎందుకు తగ్గించలేదో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణ ప్రభావం ఇంధన ధరలపై పడుతోందన్నారు. విదేశాంగ విధానాల్లో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి ప్రజల జీవనం కష్టాల్లో పడుతోందన్నారు. అసంఘటిత రంగ కార్మికులు, శ్రమజీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బొలుగూరి నరసింహ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, సిపిఐ మండల కార్యదర్శి చాపల శ్రీను, చల్మెడ సర్పంచ్ బండమీది యాదయ్య, మహిళా సమైక్య కార్యదర్శి మాధగోని సత్యమ్మ,మాజీ జెడ్పిటిసి గోసుకొండ లింగయ్య,మండల కార్యవర్గ సభ్యులు ఉప్పునుతల రమేష్, దుబ్బ వెంకన్న,బెల్లం శివయ్య,ఈదులకంటి కైలాస్,వనం వెంకన్న,ఎం పరమేష్,కురుమర్తి ముత్తయ్య, కొండ కృష్ణ, బైరుగొండ వెంకన్న, ఎన్ అశోక్,బండారు శంకర్, కట్ట దశరథ, బాబి తదితరులు పాల్గొన్నారు.
