విద్యుత్ స్తంభాలతో పొంచి ఉన్న ప్రమాదం..

సిర్పూర్ (యు), ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యు )మండల కేంద్రంతో పాటు మండలంలోని పందిరి గ్రామపంచాయతీలో గల బాబ్జిపేట్ లో విద్యుత్ స్తంభాలు వంగి విరిగిపోయి ప్రమాదానికి దారి తీసే పరిస్థితులు నెలకొంది. విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ సరిగా లేక ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన విద్యుత్ స్తంభాలు గాలి దుమారాలకు విరిగిపోయి వంగిపోవడంతో విద్యుత్ స్తంభాల వల్ల ప్రమాదం కలిగే పరిస్థితులు ఉన్నాయని ప్రజలు పేర్కొంటున్నారు. విద్యుత్ శాఖ అధికారులు గ్రామాల్లో విద్యుత్ స్తంభాల పరిస్థితి గురించి పట్టించుకోకపోవడం ఈ విషయం తెలిసిన పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి.
రాబోయే వర్షాకాలంలో ప్రమాదాలు సంభవించకుండా అధ్వానంగా వంగి విరిగిపోయే ఉన్న స్తంభాలను మరమ్మతులు చేసి కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఇలాగే విద్యుత్ స్తంభాల పరిస్థితి ఉంటే ఇప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో ఎప్పుడు గాలి దుమారాలు వస్తాయో తెలియని పరిస్థితి ఉందని ఉన్నత అధికారులు తగు చర్యలు తీసుకొని విద్యుత్ స్తంభాలకు మరమ్మతులు చేయాలని లేక కొత్త స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.
విద్యుత్ శాఖ అధికారులు గత నెలలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్ బాట కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ గ్రామాల్లో విద్యుత్ స్తంభాల పరిస్థితి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు ఒక బిల్లులపై దృష్టి పెట్టకుండా విద్యుత్ స్తంభాల పరిస్థితి గ్రామాల్లో విద్యుత్ సరఫరా విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు
