Loan-Mela-Narasaraopet: అప్పుడు బ్యాంకుల చుట్టూ జనం
Loan-Mela-Narasaraopet: అప్పుడు బ్యాంకుల చుట్టూ జనం
- విధ్వంస స్థితిలో ఏపీని కేంద్ం కాపాడింది
- నరసరావుపేట రుణమేళలో ఏపీ సీఎం
( ఆంధ్రప్రభ, పల్నాడు బ్యూరో )
అప్పట్లో అప్పుల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగాం. వడ్డీ వ్యాపారులకు చిక్కాం. ఇప్పుడు జనం దగ్గరకు బ్యాంకులు వస్తున్నాయి. కేంద్రం సాయంతో గత పాలకుల విధ్వంసం నుంచి బయటపడ్డాం. అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మందికి రూ.3,216 కోట్లను రుణ సాయాన్ని నరసరావుపేటలొ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అందజేశారు. నరసరావుపేటలో క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుమాట్లాడుతూ, సంక్షేమమైనా, అభివృద్ధి కార్యక్రమం అయినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే లక్ష్యం అన్నారు. క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించి ఎస్.హెచ్.జీలు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, వీధి వ్యాపారులు ఇలా వివిధ వర్గాలకు రుణం అందించటం అభినందనీయం అన్నారు.
Loan-Mela-Narasaraopet: అప్పుల కోసం బ్యాంకులకు వెళ్లాం..
గతంలో బ్యాంకులకు వెళ్లి రుణాలు తీసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు బ్యాంకులే మన దగ్గరకు వచ్చి రుణాలు ఇస్తున్నాయి
వ్యవసాయ రంగానికి రూ.2,363 కోట్లు, ఎంఎస్ఎంఈ యూనిట్లకు రూ.325 కోట్లు, గృహ, విద్య, వాహన, సౌరవిద్యుత్ కు రూ.624 కోట్లు రుణాలు అందాయి, బ్యాంకులు ఇచ్చే రుణాలు ఒక రైతు భవిష్యత్తును, యువత ఆశయానికి, ఓ మహిళ సాధికారితకు, ఓ పారిశ్రామికవేత్త కలల పెట్టుబడిగా నిలుస్తాయి అని సీఎం చంద్రబాబు వివరించారు. వడ్డీ వ్యాపారుల నుంచి అధికవడ్డీకి అప్పులు తెచ్చి నష్టపోకుండా బ్యాంకులు ఈ రుణమేళా ద్వారా రుణాలు ఇవ్వటం అభినందనీయం
ఎన్.పీ.ఏలపై కఠినంగా వ్యవహరించి దేశంలో డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకువచ్చిన వ్యక్తి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
జీఎస్టీ స్లాబ్ లను మార్చి పన్ను భారం తగ్గించటం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగింది, సీఎం స్ఫష్టం చేశారు.
Loan-Mela-Narasaraopet: కేంద్రం కాపాడింది
గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కేంద్రం నిలబెట్టింది.
అమరావతి, పోలవరానికి, విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఆర్ధిక సహకారం అందించింది. వీబీజీ రామ్ జీ కింద కేంద్రం నుంచి రూ.7,707 కోట్లు రాష్ట్రానికి వస్తుంది, రాయలసీమను హార్టీ కల్చర్ హబ్ గా మార్చేందుకు కేంద్రం రూ.40 వేలకోట్లు ఆర్ధిక సహకారం అందిస్తుంది, ప్రైవేటు పెట్టుబడులతో ఈ ప్రాంతాన్ని ఉద్యాన హబ్ గా మారుస్తాం, అని సీఎం హర్షం వ్యక్తం చేశారు.
Loan-Mela-Narasaraopet: అప్పుల్ని రీషెడ్యూల్ చేశాం
గత పాలనలో అధిక వడ్డీలకు చేసిన అప్పులను రీ షెడ్యూలు చేశాం.
రాష్ట్రంలోని రుణాలను రీ షెడ్యూలు చేసేందుకు కేంద్రం సహకారం అందిస్తోంది, దీని వల్ల రూ.1538 కోట్లు ఆదా అయ్యింది.మహిళలందరికీ కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదర్శంగా నిలుస్తున్నారు
10 లక్షల డ్వాక్రా సంఘాలు రూ.29 వేల కోట్లతో పొదుపులో దేశంలోనే మేటిగా నిలిచాయి. రుణాల రీ పేమెంట్ లో 99.5 శాతం చెల్లింపులోనూ డ్వాక్రా మహిళలు అగ్రస్థానంలో ఉన్నారు. వారందరినీ మహిళా వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ కార్యక్రమం చేపట్టాం, అని సీఎం వివరించారు.
Loan-Mela-Narasaraopet: పీఎం.,,సీఎం కలయికతోనే …
నరసరావుపేటలో రుణమేళలో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్
మాట్లాడుతూ, బ్యాంకులు ప్రజల దగ్గరకు వెళ్లి సేవలు అందించాలన్నది ప్రధాని మోదీ చేసిన ఆలోచన. వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వమే గ్యారంటీ ఇచ్చి వారి వ్యాపారాలకు సహకరించాలని ఈ కార్యక్రమం చేపట్టాం ఎలాంటి హామీ లేకుండా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తే వ్యాపారులకు, మహిళలకు ప్రయోజనం అందుతుంది.మైక్రో ఫైనాన్స్ కోసం వడ్డీ వ్యాపారుల నుంచి అప్పు తీసుకోవటం అధిక వడ్డీలు చెల్లించటం సరికాదనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది 2004 నుంచి 2014 వరకూ ఉన్న కేంద్ర ప్రభుత్వం ఫోన్ బ్యాంకింగ్ ద్వారా అప్పులు ఎవరికి ఇవ్వాలో నిర్దేశించేది. కానీ ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి నేతలు అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయిచచ అని వివరించారు.
Loan-Mela-Narasaraopet: బ్యా్ంకుల్లోనూ మార్పుతెచ్చాం
గ్రామ గ్రామాలకూ బ్యాంకులు వెళ్లి లబ్దిదారులకు ఎలాంటి హామీ లేకుండా రుణాలు ఇస్తున్నాయి, అర్హత ఉంటే చాలు రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం దేశవ్యాప్తంగా బ్యాంకులు తమ అప్రోచ్‌ను మార్చుకున్నాయి. ప్రజలు కూడా తమ భావన మార్చుకున్నారు. నరసరావుపేటలో నిర్వహించిన ఈ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమమే దీనికి ప్రత్యక్ష ఉదాహరణకోట్ల రూపాయల రుణాన్ని వ్యాపారులుగా, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు బ్యాంకులు ఇచ్చాయి ,. 2047 నాటికి భారత దేశం వికసిత్ దేశంగా మారాలి. అగ్రగామి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలన్నదే మా లక్ష్యం, అని కేంద్ర మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు.
Loan-Mela-Narasaraopet: బాబు ఇంటికి సీతమ్మ ..
పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించే ‘క్రెడిట్ అవుట్‌రీచ్’ (రుణమేళా) కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు రూ.3,216 కోట్ల రుణాలను లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు ఉండవల్లిలో నిర్మలా సీతారామన్‌కు మంత్రి నారా లోకేష్ ఘనస్వాగతం పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మిలా సీతారామన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తమ నివాసానికి వచ్చిన నిర్మాలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సాదర స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం. ఆయనతో కలిసి నరసరావుపేట రుణమేళాకు వచ్చారు.
