Miyapur Tipper Accident | మియాపూర్‌లో టిప్పర్ ప్రమాదం..

ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం

Miyapur Tipper Accident | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : మియాపూర్ పరిసర ప్రాంతాల్లో టిప్పర్ వాహనం డివైడ‌ర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహ‌నం ముందు భాగం ధ్వంస‌మైంది. ఈ ఘ‌ట‌న‌తో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మదీనగూడ–మియాపూర్ ఎక్స్ రోడ్ మార్గంలోని ఆల్విన్ ఎక్స్ రోడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. సమాచారం అందుకున్న సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. టిప్పర్‌ను తొలగించేందుకు మూడు క్రేన్లను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టారు.

ట్రాఫిక్ అంతరాయం తగ్గించి సాధారణ రాకపోకలను పునరుద్ధరించేందుకు పోలీసులు చర్యలు కొనసాగిస్తున్నారు. క్లియరెన్స్ పూర్తయ్యే వరకు ఆ మార్గంలో వాహనదారులకు ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలు పాటించాలని, వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించాలని సూచించారు. అత్యవసర ప్రయాణికులు అదనపు సమయం కేటాయించుకుని బయలుదేరాలని పోలీసులు కోరారు.