గాలివాన బీభత్సం..

గాలివాన బీభత్సం..

విద్యుత్‌ షాక్‌తో మూడు మేకలు మృతి

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ:

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 13వ వార్డు గాంధీనగర్‌లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో కాలనీలోని మూడు పెద్ద చెట్లు విద్యుత్ స్తంభాలపై విరిగిపడ్డాయి.
ఈ ఘటనలో విద్యుత్ స్తంభం కూలిపోగా, విద్యుత్ తీగలు తెగి రోడ్డుపై పడ్డాయి. అదే సమయంలో మేకల పెంపకందారుడు తన మేకలను ఇంటికి తీసుకువస్తుండగా, విద్యుత్ తీగలు తగిలి మూడు మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి.

మృతిచెందిన మేకలు చిప్ప గట్టయ్య అనే వ్యక్తికి చెందినవిగా గుర్తించారు. ఈ ఘటనతో దాదాపు రూ.50 వేల నష్టం వాటిల్లినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.విషయం తెలుసుకున్న టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులకు సమాచారం అందించారు.

ఈ సంఘటనను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా సహాయం అందేలా కృషి చేస్తానని ప్రభాకర్ యాదవ్ తెలిపారు.

Leave a Reply