తాము ఎవరి భూమిని ఆక్రమించలేదు..
తాము ఎవరి భూమిని ఆక్రమించలేదు..
భూయజమానులు..
జన్నారం, ఆంధ్రప్రభ : తాము ఎవరి భూమిని ఆక్రమించలేదని, ఐదేళ్ల క్రితం జన్నారం శివారులోని సర్వేనెంబరు 80లోని 35 గుంటల భూమిని కొనుగోలు చేశామని మండలంలోని పొనకల్ వాసులు ద్యావరశెట్టి శ్రీధర్ కుమార్, ఉత్తూరి ప్రభాకర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. జన్నారం గ్రామానికి చెందిన పేంద్రం సురేష్ కు డబ్బులు ఇచ్చి ఆ భూమిని కొనుగోలు చేశామని వారు చెప్పారు.
ప్రస్తుతం ఆ భూమిపై జన్నారం, ఆసిఫాబాద్ కు చెందిన పాషా, మూల్పూరి రాజేంద్రప్రసాద్, వాజీద్, రాజేశ్వర్,కోవా విజయ్ కుమార్, మనోజ్ లు కలిసి జన్నారం గోండుగూడకు చెందిన సోయం లక్ష్మణ్, పారుబాయి భూమి అని ఈ నెల 10న మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించి, స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారని వారు తెలిపారు. తాము కొనుగోలు చేసిన ఆ భూమికి సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయని, కావల్సుకొని తమ పరువు,ప్రతిష్టకు ఆ వ్యక్తులు భంగం కలిగించారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ భూమిలో జెండా పాతారని, ఆ జెండాను తొలగించాలని, అమాయక ఆదివాసీలను తప్పుదోవ పట్టిస్తున్న ఆ వ్యక్తులపై చర్య తీసుకోవాలని అధికారులను వారు కోరారు.
