జుక్కల్ లో పోటాపోటీగా తై బజార్ వేలం..

జుక్కల్ (కామారెడ్డి, )ఆంధ్రప్రభ : జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ సంబంధించిన 2026-2027 సంవత్సరానికి సంబంధించిన వారాంతపు సంత, రోజువారి సంత వేలం శనివారం గ్రామ సర్పంచ్ సావిత్రి సాయగౌడ్ అధ్యక్షతన నిర్వహించగా, ఆసక్తిగల వారు పోటాపోటీగా పాల్గొన్నారు.

ఈ వేలం పాటను కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ నిర్వహించారు. ప్రతి గురువారం నిర్వహించే వారంతపు సంతను జావిద్ బాగ్ వాన్ వేలం పాటలో 3,25,000 లకు కైవసం చేసుకోగా,రోజు వారి సంతను గాజుగౌడ్ 1,62,500 రూపాయలకు దక్కించుకున్నారు.ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ పెద్దలు,వ్యాపారస్తులు పాల్గొన్నారు.

Leave a Reply