‘మిత్రుడంటే రేవంత్‌లా ఉండాలి’.. భగీరథ్ బెయిల్‌పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ రావడం బాధాకరమని పేర్కొన్నారు. హైకోర్టు తీర్పును గౌరవిస్తున్నప్పటికీ, బాధిత బాలికకు న్యాయం జరిగేలా ప్రభుత్వం వ్యవహరించాల్సిందని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా స్పందించిన ఆయన, కేసు దర్యాప్తులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. నిందితులను కాపాడే ధోరణి దర్యాప్తులో కనిపించిందని, బాధితురాలిని రాష్ట్ర హోంమంత్రి పరామర్శించకపోవడం కూడా ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలు కలిగిస్తోందని విమర్శించారు.
నిందితుడికి గతంలో పరీక్షల నిమిత్తం మధ్యంతర బెయిల్ లభించినప్పుడే రాజకీయ మైత్రి బయటపడిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి హోంమంత్రిగా, కేంద్రంలో బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నంతకాలం బాధిత మైనర్‌కు న్యాయం జరిగే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం బాధితుల తరఫున నిలవాల్సిన సమయంలో ప్రభుత్వ న్యాయవాదులు నిందితుడి తరఫున వ్యవహరించినట్లు కనిపించిందని ఆయన ఆరోపించారు. ఇది ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే జరిగిందని పేర్కొన్నారు.
పోక్సో వంటి తీవ్రమైన కేసులో నిందితుడు బెయిల్‌పై బయటకు రావడం ఆందోళన కలిగిస్తోందని, బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
