45వ సారి రక్తదానం చేసిన ముదాం శ్రీధర్..

బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని కాచాపూర్ గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం రక్తదానం చేశారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రామానికి చెందిన ముదాం శ్రీధర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో 45వ సారి రక్తదానం చేశారు. గ్రామానికి చెందిన మోతే సంతోష్ రెడ్డి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాదులో 39వ సారి రక్తదానం చేశారు. అదే గ్రామానికి చెందిన గూడెం శ్రీనివాస్ రెడ్డి సైతం హైదరాబాదులో రక్తదానం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడవచ్చని చెప్పారు. ఎంతోమంది రక్తహీనతతో బాధపడుతూ సరైన రక్తం దొరకక చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రక్తదానం చేసేందుకు యువత ముందుకు రావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మూడు నెలలకు ఒకసారి యువకులు రక్తదానం చేస్తే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. గ్రామానికి చెందిన ముదాం శ్రీధర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో రక్త నమూనాల సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాధితులకు ఉచితంగా రక్తదానం అందజేస్తున్నారు. ఆయన చేస్తున్న సేవలను పలువురు అభినందించారు.

Leave a Reply