సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూత

సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూత
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : భీమ్‌గల్ మండలం బెజ్జోరా గ్రామానికి చెందిన భీమ్‌గల్ మండల్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ శ్రీరామ్ రవి కన్నుమూశాడు. గత ఎనిమిది నెలల క్రితం జరిగిన రోడ్ ప్రమాదంలో ఆయనకు తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. కొద్దిరోజుల చికిత్స అనంతరం కుటుంబ సభ్యులు ఆయనను స్వగ్రామానికి తీసుకువచ్చి వైద్యుల సూచనల మేరకు ఎనిమిది నెలల పాటు’ సేవలందించారు.
కోలుకుంటున్నాడనే ఆశలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో మళ్లీ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రవి మృతితో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆయన అంత్యక్రియలకు బుధవారం తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మనాల మోహన్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు. గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రవికి నివాళులు అర్పించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
