prime minster | మెల్‌బోర్న్‌లో మోదీ సందడి
prime minster | మెల్‌బోర్న్‌లో మోదీ సందడి
ప్రవాస భారతీయులతో భేటీ
మార్వెల్ స్టేడియంలో మోదీ సందేశం
భారత్-ఆస్ట్రేలియా బంధం మరింత బలోపేతం అవుతుంది
ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను సన్నిహిత మిత్రుడిగా అభివర్ణించిన మోదీ
మెల్‌బోర్న్‌లో మార్మోగిన ‘మోదీ.. మోదీ’
ఆంధ్రప్రభ, మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ మెల్‌బోర్న్‌లోని మార్వెల్ స్టేడియంలో నిర్వహించిన ‘మెల్‌బోర్న్ మీట్స్ మోదీ’ కార్యక్రమంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. వేలాది మంది భారతీయులు హాజరైన ఈ సభలో భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ప్రవాస భారతీయుల పాత్రపై ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ను తన మంచి మిత్రుడిగా అభివర్ణించిన మోదీ, ఇరు దేశాల మధ్య బంధం గత కొన్నేళ్లుగా మరింత బలపడిందన్నారు. భారత్, ఆస్ట్రేలియా సహజమైన, విశ్వసనీయ భాగస్వాములుగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో కలిసి ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
తన ఆస్ట్రేలియా పర్యటనలను ప్రస్తావిస్తూ, “2014లో వచ్చాను.. మళ్లీ 2023లో వచ్చాను.. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. ఆస్ట్రేలియాలో హ్యాట్రిక్ పూర్తి చేశాను” అని మోదీ వ్యాఖ్యానించారు. మెల్‌బోర్న్‌లో తనకు లభించిన అపూర్వ స్వాగతానికి ప్రవాస భారతీయులకు కృతజ్ఞతలు తెలిపారు.
భారత్-ఆస్ట్రేలియా వార్షిక నాయకత్వ సదస్సు (India–Australia Annual Leaders’ Summit)లో పాల్గొనేందుకు ఈ పర్యటన చేపట్టినట్లు పేర్కొన్న ఆయన, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు ఈ భేటీలు దోహదపడతాయని తెలిపారు. మార్వెల్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మందికి పైగా ప్రవాస భారతీయులు హాజరై ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు.
ఈసారి మెల్‌బోర్న్ వాసులతో గడపాలని వచ్చాను. అహ్మదాబాద్.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఉంది. మెల్‌బోర్న్ ఐకానిక్ స్టేడియంగా ప్రసిద్ధి చెందింది. ఆస్ట్రేలియాలోని ఈ షో హౌస్‌ఫుల్, బ్లాక్‌బస్టర్. నా పర్యటనకు 18 ఏళ్ల ముందు వరకు ఏ ప్రధానీ పర్యటించలేదని మోడీ అన్నారు.
ప్రపంచ దేశాలకు మోడీ ఒక స్ఫూర్తి. మోడీ నాయకత్వంలో భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మోడీ నా ఆప్తమిత్రుడు అని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ వర్ణించారు.
