rain | రాబోయే రెండు గంట‌ల్లో..

తెలంగాణలో వ‌ర్షం
పలు జిల్లాల్లో భారీ వానలు
హైదరాబాద్‌లో జల్లులు

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ తక్షణ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రానున్న రెండు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, నాగర్‌కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు హెచ్చరించారు.

అలాగే నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి-భువనగిరి, జనగాం, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వచ్చే రెండు గంటల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు, వాగులు, చెరువుల సమీపంలో అవసరం లేకుండా వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.