gold-rate-today-july-9-2026 | స్వల్పంగా పెరిగిన పసిడి.. పది రోజుల్లో రూ.3,760 తగ్గిన గోల్డ్ రేట్
gold-rate-today-july-9-2026 | స్వల్పంగా పెరిగిన పసిడి.. పది రోజుల్లో రూ.3,760 తగ్గిన గోల్డ్ రేట్
స్వల్పంగా పెరిగిన బంగారం రేట్
24 క్యారెట్ల, 22 క్యారెట్ల గోల్డ్ రేట్లు ఎంతో తెలుసా..
గత 10 రోజుల ధరల మార్పులు
అంతర్జాతీయ మార్కెట్..
gold-rate-today-july-9-2026| ఆంధ్రప్రభ వెబ్, బిజినెస్ ప్రతినిధి : బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. జూలై 3న గరిష్ఠ స్థాయికి చేరిన బంగారం ధరలు ఆ తర్వాత తగ్గుముఖం పట్టాయి. అయితే అంతర్జాతీయంగా కొనసాగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ బంగారం ధరలో స్వల్ప తేడాలు మాత్రమే కనిపిస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే 22కేకి పది గ్రాములకు వంద రూపాయలు, 24కే కి రూ.110లు పెరిగింది. పది రోజుల్లో 24 కేకి రూ.3,760, 22కేకి రూ. 3,450 తగ్గింది.
ఈ రోజు ధరలు..
ఈ రోజు పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 1,43,240 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,31,300 ఉంది. ఇదే బంగారం నిన్న 1,43,130 రూపాయలు, 1,31,300 రూపాయలు ట్రేడ్ అయింది. పది రోజుల క్రితం 1,47,00 రూపాయలు 24కే బంగారం ధర ఉండేది. అలాగే 22కే పది గ్రాములు రూ.1,34,750 ఉండేది.
ఈ రోజు భారత్లో బంగారం ధరలు

(గ్రాముకు)
బంగారం రకం ధర
24 క్యారెట్లు రూ.14,324
22 క్యారెట్లు రూ.13,130
10 గ్రాముల ధర
24 క్యారెట్లు: రూ.1,43,240
22 క్యారెట్లు: రూ.1,31,300
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల్లో పెద్దగా వ్యత్యాసం కనిపించడం లేదు. చెన్నైలో మాత్రం ఇతర నగరాలతో పోలిస్తే గ్రాముకు సుమారు రూ.98 అధికంగా ఉంది. పన్నులు, స్థానిక డిమాండ్, మార్కెట్ పరిస్థితుల ఆధారంగా నగరాల మధ్య స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి.
చెన్నై రూ.14,422 రూ.13,220
ఢిల్లీ రూ.14,339 రూ.13,145
హైదరాబాద్ రూ.14,324 రూ.13,130
ముంబై రూ.14,324 రూ.13,130
కోల్కతా రూ.14,324 రూ.13,130
బెంగళూరు రూ.14,324 రూ.13,130
అహ్మదాబాద్ రూ.14,329 రూ.13,135
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు

అంతర్జాతీయ స్పాట్ మార్కెట్లో బంగారం ధరలు ప్రస్తుతం ఔన్సు (31.10 గ్రాములు) కు 2,400 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. భారత కరెన్సీలో లెక్కిస్తే అంతర్జాతీయ ధర గ్రాముకు సుమారు రూ.12,500 పలుకుతుంది.
అయితే దేశీయ మార్కెట్లో వినియోగదారులు చెల్లించే ధరలు అంతర్జాతీయ ధరల కంటే ఎక్కువగా ఉంటాయి.
గమనిక: బంగారం ధరలు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రోజులో పలుమార్లు మారవచ్చు. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు సరి చూసుకోవలెను.
