బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుండెపోటుతో మృతి
బాల్కొండ, ఆంధ్రప్రభ: తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి (65) గురువారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందాడు. బీసీ సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు హఠాన్మరణంతో బీసీ సంఘాల నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులు,బంధువులు కన్నీరు మున్నిరవుతున్నారు.
దాసరి మూర్తి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.మెండోరాలో విషాదఛాయలు అలుముకున్నాయి. అంత్యక్రియలను శుక్రవారం ఉదయం నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు,బంధువులు తెలిపారు.
