brs | సర్‌పై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
brs | సర్‌పై అప్రమత్తంగా ఉండాలి : కేటీఆర్
గ్రేటర్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశం
ఎస్‌ఐఆర్‌పై అభ్యంతరాలపై చర్చ
తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో సమావేశమైన గ్రేటర్ హైదరాబాద్ పార్టీ నేతలు
ఎస్‌ఐఆర్‌పై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, పార్టీ కార్యాచరణపై దిశానిర్దేశం
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీ బలోపేతంతో పాటు తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జులు, అలాగే ఎస్‌ఐఆర్ (SIR) కమిటీ సభ్యులు హాజరయ్యారు. సమావేశంలో గ్రేటర్ హైదరాబాద్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలు, ఫిర్యాదులు, వాటిపై పార్టీ తీసుకోవాల్సిన వైఖరి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయడం, రానున్న కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందించడం వంటి అంశాలపై కూడా కేటీఆర్ నేతలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం.
