30న మొక్కజొన్న రైతుల ధర్నా
30న మొక్కజొన్న రైతుల ధర్నా
- కెవిఆర్ మోహన్ చంద్
శావల్యాపురం, ఆంధ్రప్రభ : ప్రభుత్వ మద్దతు ధరకు మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని కోరుతూ ఈ నెల 30న జిల్లా కలెక్టరేట్ వద్ద మొక్కజొన్న రైతులతో ధర్నా నిర్వహించనున్నట్లు రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కె.వి.ఆర్ మోహన్ చంద్ తెలిపారు. మండల కేంద్రమైన శావల్యాపురంలో శనివారం ఆయన మాట్లాడుతూ మొక్కజొన్న రైతులతో కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని, ప్రతి ఒక్క రైతు తరలి రావాలని పిలుపునిచ్చారు.
మండలంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి క్వింటాకు రూ. 2,400 చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. బయటి మార్కెట్లో రైతుల దగ్గర నుండి 1700 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తున్నారని దీనివల్ల రైతు నష్టపోతున్నాడని అన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేసి దళారుల రాజ్యానికి స్వస్తి పలకాలని అన్నారు. గత నెల రోజుల కాలంగా రైతులు అనేక రకాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నా కూడా అధికారులకు, నాయకులకు చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన విమర్శించారు. ఆయనతో పాటు మండల రైతు సంఘ నాయకులు ఉన్నారు.
