విద్యుత్ ఘాతంతో మొక్కజొన్న పంట దగ్ధం
విద్యుత్ ఘాతంతో మొక్కజొన్న పంట దగ్ధం
- ఆదుకోవాలని బాధిత రైతుల వేడుకలు
చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు,అంటుకొని,నిప్పురవ్వలు పడి 16 ఎకరాలలో మొక్కజొన్న పంట, దగ్ధమైన సంఘటన శనివారం మండలంలోని తిరు మలాపూర్ లో జరిగింది. గ్రామస్తులు బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలం లోని తిరుమలపూర్ కి చెందిన ఆరేల్లి కృష్ణ మూర్తి, 4,ఎకరాలు, బొజ్జం సదయ్య 2,ఏకరాలు, గొపగాని చిన్న వెంక టేశ్వర్లు, 4ఎకరాలు గొపగాని రవీందర్ 4 ఎకరాలు, గోపగాని ఆనందం, 2 ఎకరాల మొక్క జొన్న పం ట సాగు చేశారు. పంట కోసి, తదుపరి రోజు కూలీలతో కంకి ఎత్తే కార్యక్రమం ఉండగా, శనివారం వ్యవసాయ పంటపై ఉన్న విద్యుత్ తీగలు రాపిడి కావడంతో నిప్పురవ్వ లు చేనులో పడి మొక్కజొన్న అంటుకొని, మొక్కజొన్న కంకులతో దగ్ధ మైనట్టు తెలిపారు.
పంటలో ఉన్న గోపగాని వెంకటేశ్వర్లు, 100 పైపులు, కృష్ణమూర్తి 30 పైపులు, బొజ్జం సదయ్య 5 పైపులు కాలిపోయాయి. స మాచారం అందుకున్న భూపాలపల్లి అగ్నిమాక శకటం వచ్చి మంటలను ఆర్పేశారు. ఘటన ప్రదేశాన్ని స్థానిక ఎస్సై పోచంపల్లి సతీష్ సర్పంచ్, జన్నే సురేష్ పరిశీలించారు. విద్యుత్ విద్యుత్ సర్క్యూట్ తో మొక్కజొన్న పంట దగ్ధమై రూ 8 లక్షల నష్టపోయినట్లు బాధిత రైతులు తెలిపారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.
