వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలే మేలు
చిట్యాల, ఆంధ్రప్రభ: ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వరి సాగుకు బదులుగా తక్కువ నీటితో పండే ఆరుతడి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని చిట్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
మంగళవారం ఆయన మాట్లాడుతూ, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. తక్కువ నీటితో అధిక ప్రయోజనం అందించే పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
రైతు మేళాలో భాగంగా మండల కేంద్రంలోని రైతు వేదికలో మొక్కజొన్న, కూరగాయల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆసక్తి గల రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని కోరారు.
