TG PGECET Results | పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కీలక అడుగు
TG PGECET Results | పీజీ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కీలక అడుగు
TG PGECET Results | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తెలంగాణ విద్యార్థులకు మరో శుభవార్త అందింది. గత రెండు రోజులుగా వివిధ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఇవాళ (శుక్రవారం) తెలంగాణ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2026 (TG PGECET-2026) ఫలితాలను అధికారులు విడుదల చేశారు. ఎంటెక్, ఎం.ఫార్మసీ, ఎంఈ, ఎంఆర్క్ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఈ పరీక్ష ఫలితాల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి (TGCHE) ఆధ్వర్యంలో జేఎన్‌టీయూహెచ్ (JNTUH) ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించింది. మే 29 నుంచి జూన్ 1 వరకు వివిధ దశల్లో పరీక్షలు నిర్వహించగా, తాజాగా ఫలితాలను ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు.
అభ్యర్థులు తమ మార్కులు, ర్యాంక్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో పరిశీలించాలని అధికారులు సూచించారు. ఫలితాల కోసం pgecet.tgche.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించి హాల్‌టికెట్ నంబర్ వివరాలతో లాగిన్ అయి ర్యాంక్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
