బాధిత కుటుంబాలను పరామర్శించిన మానాల మోహన్ రెడ్డి
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్‌పల్లి మండలంలోని హసకొత్తూరు గ్రామంలో పలు బాధిత కుటుంబాలను తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వడ్ల రమేష్ తండ్రి కుటుంబ సభ్యులను కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే మాజీ సర్పంచ్ ఏనుగు రాజేశ్వర్ తండ్రి మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, కుటుంబ పెద్దలను కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, మాజీ మండల అధ్యక్షుడు సుంకేట రవి, సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, పడిగేల ప్రవీణ్, తిప్పిరెడ్డి శ్రీనివాస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, వివిధ మండలాల అధ్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
