Petition | గ్రంథాల‌యానికి కొత్త‌ భ‌వ‌నం ఏర్పాటు చేయాలి

Petition | గ్రంథాల‌యానికి కొత్త‌ భ‌వ‌నం ఏర్పాటు చేయాలి

  • గ్రంథాలయ జిల్లా చైర్మన్ కోట రాజబాబు వినతి పత్రం

Petition | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని గ్రంథాలయానికి నూతన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించాలని, గ్రంథాలయ జిల్లా చైర్మన్ కోట రాజబాబుకు గ్రామ సర్పంచ్ తౌటం లక్ష్మి, ఉప సర్పంచ్ బుర్ర వెంకటేష్ గౌడ్, నాలుగో వార్డ్ మెంబర్ తౌటం నవీన్ వినతిపత్రం అందజేశారు. ఇవాళ‌ జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గ్రామపంచాయతీలో నిర్వహిస్తున్న గ్రంథాలయాన్ని చైర్మన్ హరిబాబు పరిశీలించారు. దీంతో గ్రామపంచాయతీ పాలకవర్గం చైర్మన్ ను శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, కాంగ్రెస్ నాయకులు దొడ్డి కిష్టయ్య, బుర్ర లక్ష్మణ్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, చిట్యాల గ్రంధాలయ ఇన్చార్జి గంగాధరి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply