పోలీస్ కానిస్టేబుల్ శ్రీజ కు సన్మానం

పోలీస్ కానిస్టేబుల్ శ్రీజ కు సన్మానం

మెండోరా, ఆంధ్ర ప్రభ: నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ లో విధులు నిర్వహించి, బదిలీపై వెళ్తున్న పలువురు పోలీసు అధికారులకు అలాగే సిబ్బందికి బుధవారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఎస్సై సుహాసిని ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అనంతరం బదిలీ పై వెళ్తున్న మహిళా కానిస్టేబుల్ శ్రీజ, పలువురు కానిస్టేబుల్స్ సిబ్బంది శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సుహాసిని మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణలో బదిలీపై వెళ్తున్న సిబ్బంది అందించిన సేవలు మరువలేనివని ఆమె అన్నారు. విధి నిర్వహణలో వారు చూపిన అంకితభావం, క్రమశిక్షణ తోటి సిబ్బందికి స్ఫూర్తి దాయకమని సూచించారు. వెళ్లి ప్రాంతాల్లో కూడా వారు ఇలాగే ప్రజలకు సేవలందిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆమె ఆకాంక్షించారు.సన్మానం పొందిన సిబ్బంది మాట్లాడుతూ మెండోరా పోలీసు స్టేషన్ లో పని చేయడం తమకు మంచి అనుభూతిని ఇచ్చిందని, తోటి సిబ్బంది అలాగే ఉన్నతాధికారులు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply