కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు లబ్ది

కాంగ్రెస్ తోనే అన్ని వర్గాలకు లబ్ది

  • మంత్రి వివేక్ వెంకటస్వామి

చెన్నూర్, ఆంధ్రప్రభ : వర్గ విభేదాలు లేకుండా అన్ని వర్గల ప్రజలకు లబ్ది జరిగేలా ప్రజాపాలన చేయడం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యమని కార్మిక ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకట స్వామి అన్నారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో అర్హులైన మహిళ లబ్ధిదారులకు చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి పేదవారి కలలను సాకారం చేసేవిధంగా ప్రజాపాలన చేపడుతుందని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా చేపడుతుందని , అర్హులైన లబ్దిదారుల గృహలకు 200యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తుందని అన్నారు.

నియోజకవర్గం లోని జైపూర్, కోటపల్లి మండలాల్లోని సుమారు 145 మంది మహిళా లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి & షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం చెన్నూరు మండలంలోని బాబురావుపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొంది గృహప్రవేశం జరుపుకున్న వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార దీపక్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.