ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి

ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలి
-టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి
తొర్రూరు, ఆంధ్రప్రభ: ప్రజా ఆరోగ్యానికి ప్రాధాన్యతనివ్వాలని, ప్రైవేటు ఆసుపత్రులు ఆ దిశగా ముందుకు వెళ్లాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి తెలిపారు. డివిజన్ కేంద్రంలోని రామకృష్ణ థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన మహేష్ పిల్లల ఆసుపత్రిని బుధవారం ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు. పిల్లల ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ పి.మహేష్, మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ లతో కలిసి ఝాన్సీ రెడ్డి మాట్లాడారు. గతంలో కార్పొరేట్ స్థాయి వైద్యం కోసం హైదరాబాద్, హనుమకొండ వంటి నగరాలకు వెళ్లాల్సి వచ్చేదని, ప్రస్తుతం తొర్రూరు వంటి గ్రామీణ ప్రాంతాల్లోనూ కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రావడం ఆహ్వానించదగిందన్నారు.
చిన్నారుల ఆరోగ్యాలకు ఆసుపత్రులు భరోసాగా నిలవాలని కోరారు. పాలకుర్తి నియోజకవర్గం మెడికల్ హబ్ గా మారుతుందని, నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. చిన్నపిల్లలు దేశ భవిష్యత్తుకు మూలాలని, వారి ఆరోగ్యాలను కాపాడాల్సిన బాధ్యత ఆసుపత్రులపై ఉందన్నారు. మహేష్ పిల్లల ఆసుపత్రి లో వైద్య సౌకర్యాలపై ఝాన్సీ రెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ రామచంద్రయ్య,ఆయా ఆసుపత్రుల వైద్యులు డాక్టర్ ఎస్ రామ నరసయ్య,డాక్టర్ యాదగిరిరెడ్డి,కాంగ్రెస్ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి, గుండాల నరసయ్య, తాళ్ల పెళ్లి రమేష్ గౌడ్, ప్రవీణ్ యాదవ్,ఆసుపత్రి ప్రతినిధులు పి.యాకయ్య, సునీత, స్థానికులు పాల్గొన్నారు.
