సకాలంలో వర్షాలు కురవాలని వరుణ యాగం..

బోధన్, ఆంధ్రప్రభ : సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ధారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలో వరుణ యాగం నిర్వహించారు.

ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఉదయ్ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహా యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రకృతి అనుగ్రహంతో రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో ధారణ ఫౌండేషన్ ప్రతినిధులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పాల్గొని యాగంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.