బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ కృషి

బంగారు తెలంగాణగా మార్చేందుకు కేసీఆర్‌ కృషి

ఊట్కూర్, ఆంధ్రప్రభ: తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎంతో కృషి చేశారని రాష్ట్ర ప్రజలు మళ్ళీ కేసీఆర్ పాలన కోరుతున్నారని ఊట్కూర్ మండల మాజీ రైతుబంధు అధ్యక్షులు సుధాకర్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేటజిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని అమీన్ పూర్ లో బీఆర్ఎస్ ఆవిర్భావవేడుకలను పురస్కరించుకొని పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ దశను దిశను మార్చింది బీఆర్ఎస్ పార్టీఅని కేసీఆర్‌ తెలంగాణను అభివృద్ధి పరంగా భారత దేశంలో ప్రథమ స్థానంలో నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను మళ్ళీ కరువు కాటకాలు విద్యుత్ కోతలు హైడ్రా కూల్చివేతలు రైతులు ఆత్మహత్యలతో తెలంగాణను అధోగతి వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తుందని కాంగ్రెస్, ను దుయ్యబట్టారు.

రాబోయే రెండున్నర ఏళ్లలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని వర్గాల ప్రజలకు ఆకాంక్షలను గౌరవించి తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే విధంగా కేసీఆర్ నూతన ఉత్సవంతో కదులుగుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నారాయణరెడ్డి, అనిల్ కుమార్, రమేష్, శంకర్ రెడ్డి, కుర్వవన్నప్ప, శేఖర్, గోవర్ధన్ రెడ్డి, సిద్ధప్ప, బాబు రాజు, తమన్న, మైబు రహీమతుల్లా, బాలప్ప శేఖర్ ఆనంద్, శంకర్,ఎర్రశంకరప్ప తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply