త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ..
త్యాగానికి ప్రతీక బక్రీద్ పండుగ..
- రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి
- ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి శ్రీహరి మాజీ ఎమ్మెల్యే చిట్టెం
మక్తల్, ఆంధ్రప్రభ : త్యాగాలకు దానధర్మాలకు ప్రతీకైనటువంటి బక్రీద్ పండుగను మక్తల్ నియోజకవర్గంలో ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు బక్రీద్ పర్వదినం సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈద్గా వద్ద స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ముస్లింలను కలుసుకొని బక్రీద్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు బక్రీద్ ప్రార్ధనలను తరం వారు ముస్లింలందరినీ ఆలింగాధం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీహరి మాట్లాడుతూ.. త్యాగం, సేవా భావం, మానవత్వానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగ సమాజంలో సౌభ్రాతృత్వాన్ని, పరస్పర ప్రేమాభిమానాలను పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ శాంతి, సామరస్య వాతావరణంలో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.ప్రతి కుటుంబంలో ఆనందం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నిండాలని, రాష్ట్ర ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని అల్లాహ్‌ను ప్రార్థిస్తున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ ప్రజల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. మైనార్టీల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు .కాంగ్రెస్ పాలనలోనే ముస్లింలకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ సోదర భావంతో మెలగాలని మంత్రి వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు అబ్దుల్ ఖవి ,షాబుద్దీన్ ఖాజీ, ఖాదీర్, ఇషాక్, హమీద్ పటేల్, మున్సిపల్ కౌన్సిలర్ రహీం పటేల్, కోఆప్షన్ సభ్యులు బి.శంషుద్దీన్, నాయకులు నూరుద్దీన్, హుసాముద్దీన్, మంజూర్ ఇలాహి, అబ్దుల్ రెహమాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి.నర్సింహ గౌడ్ ,మాజీ ఎంపిపి చంద్రకాంత్ గౌడ్ ,బిజెపి జిల్లా నాయకులు బాల్చేడ్ మల్లికార్జున్ ,కాంగ్రెస్ నాయకులు బోయ రవికుమార్,వల్లంపల్లి లక్ష్మణ్, నీల గౌడ్, గోవిందరావు ,గోవర్ధన్, అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు
