మోత్కూర్ లో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం

మోత్కూర్ లో ఎరువుల దుకాణాల బంద్ విజయవంతం
మోత్కూర్, ఆంధ్రప్రభ: ఎరువుల దుకాణదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం చేపట్టిన దేశ వ్యాప్త ఎరువుల దుకాణాల బంద్ లో భాగంగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంతో పాటు ఆయా పాటిమట్ల, దత్తప్పగూడెం గ్రామాల్లో యజమానులు ఒక్క రోజు స్వచ్చందంగా దుకాణాలు మూసివేసి బంద్ పాటించడంతో బంద్ కాస్త విజయవంతమైంది. ఎరువుల ఉత్పత్తిదారులు సరఫరాపై ,రవాణా చార్జీల పై హామీ ఇవ్వాలని,నానో యూరియా,డిఏపి లింకు ప్రొడక్ట్స్ లేకుండా ఎరువులు సరఫరా చేయాలని, డీలర్ల మార్జిన్ పెంచాలని డిమాండ్ చేశారు. పి.ఏ.సి.ఎస్ ల మాదిరిగా ప్రతి డీలర్ కి యూరియా సరఫరా చేయాలని, లైసెన్స్ కలిగిన వ్యాపారులపై అధికారుల దాడులు నిరోదించి,అక్రమ దళారులపై దాడులు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎరువుల దుకాణాల యజమానుల సంఘం మండల అధ్యక్షుడు గుణగంటి సత్యనారాయణ గౌడ్,ఉపాధ్యక్షుడు అనంతుల వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పులుసాని నర్సిరెడ్డి, ప్రతినిధులు బుక్క విశ్వనాధం ,మర్రి మధు తదితరులు పాల్గొన్నారు.
