టీడీపీలో భారీగా చేరికలు
టీడీపీలో భారీగా చేరికలు
- ఎమ్మెల్యే సమక్షంలో 500 మంది చేరిక
ఎమ్మిగనూరు, ఆంధ్రప్రభ: ఎమ్మిగనూరు పట్టణంలోని కటికె గేరి ప్రాంతానికి చెందిన 9, 10, 11వ వార్డులు,144, 145, 146, 147, 149, 150 బూత్‌ల పరిధిలోని సుమారు 500 మంది వైఎస్సార్‌సీపీ ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ముందుకు వస్తున్నామని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
