చిట్యాలలో ఘనంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ వేడుకలు

చిట్యాలలో ఘనంగా బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ వేడుకలు
చిట్యాల, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ ) 26వ వార్షికోత్సవం సోమవారం చిట్యాల మండల కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు మండల కేంద్రంలో గులాబీ జెండాను ఆవిష్కరించి సంబరాలు జరుపుకున్నారు.
చిట్యాల టౌన్ అధ్యక్షులు బుర్ర శ్రీధర్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు అల్లం రవీందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం మహానేత కేసీఆర్ గారు ఈ పార్టీని స్థాపించారని కొనియాడారు.
లక్షలాది మంది త్యాగాలు, పోరాటాల ఫలితంగానే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, రాష్ట్ర అభివృద్ధిలో బిఆర్ఎస్ పాత్ర అద్వితీయమని రవీందర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ఆదర్శంగా నిలిచాయని, మౌలిక సదుపాయాల కల్పనలో బిఆర్ఎస్ పాలన మైలురాయిగా నిలిచిపోతుందని అన్నారు.
ఈ వేడుకల్లో యూత్ మండల అధ్యక్షులు తౌటం నవీన్, జిల్లా నాయకులు చింతల రమేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ చిలుముల వసంత-రమణాచారి, కొడారి ఓదెలు, నోముల నాగరాజు, జంబుల తిరుపతి, టౌన్ ప్రధాన కార్యదర్శి మేడిపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే నాయకులు సాద మల్లయ్య, కాట్రేవుల కుమార్, జన్నే యుగేందర్, పిట్టల రాజమౌళి, ఆరేపల్లి సమ్మయ్య, కట్కూరి రాజేందర్, పుల్ల శైలేందర్, పుల్ల సతీష్, చేరి రవి, రాయిని శ్రీకాంత్, మైదం కరుణ, మూసాపురి రవీందర్, గుండా సురేష్, వేముల హరీష్ తదితరులు పాల్గొన్నారు.
