నూతన ఎస్ఐగా వెంకన్న బాధ్యతల స్వీకరణ

నూతన ఎస్ఐగా వెంకన్న బాధ్యతల స్వీకరణ
నర్సింహులపేట,ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల ఎస్ఐగా బానోత్ వెంకన్న ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని,అసాంఘిక కార్యక్రమాలు అక్రమ ఇసుక రవాణా,గంజాయి,నల్ల బెల్లం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.పోలీస్ సిబ్బంది నూతన ఎస్ఐ కి శుభాకాంక్షలు తెలిపారు.ఇక్కడ పనిచేసిన ఎస్ఐ మాలోత్ సురేష్ జిల్లా పోలీస్ కార్యాలయానికి బదిలీపై వెళ్లారు.
