కారంపూడి ఎస్సై సస్పెండ్..
- బకాయిల వ్యవహారంలో చర్య..
నరసరావుపేట (ఆంధ్రప్రభ) : కారంపూడి ఎస్సై వాసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల గాదెవారిపల్లి గ్రామానికి చెందిన మిర్చి వ్యాపారి చల్ల అయ్యప్పను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, రైతులకు మిర్చి కొనుగోలు బకాయిలు చెల్లించాలని మందలించిన ఘటన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలను పరిశీలించిన అనంతరం ఉన్నతాధికారులు ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.
