దోమల నివారణ చర్యలను పరిశీలించిన సర్పంచ్

కమ్మర్‌పల్లి (ఆంధ్రప్రభ): కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీలో దోమల నివారణ చర్యలను గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ బుధవారం పరిశీలించారు. కాలనీలో ఫాగింగ్ నిర్వహించడంతో పాటు మురుగు కాల్వల్లో యాంటీ లార్వా మందులు పిచికారీ చేయించి, నీటి నిల్వలను తొలగించే చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దోమల వ్యాప్తిని అరికట్టేందుకు గ్రామ పంచాయతీ తరఫున నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు మాధవేణి లావణ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.