నర్సింగ్ విద్యార్థిని మృతితో విషాదం..
కుటుంబాన్ని పరామర్శించిన డాక్టర్ కల్నల్ బిక్షపతి
మృతురాలికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ధైర్యం
రఘునాథపల్లి, ఆంధ్రప్రభ: రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామానికి చెందిన మేడే అంజయ్య కుమార్తె, నర్సింగ్ విద్యార్థిని మేడే పూజ మృతి స్థానికంగా విషాదాన్ని నింపింది.
ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ కల్నల్ మాచర్ల బిక్షపతి మృతురాలి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూజ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులు ఈ విషాదం నుంచి ధైర్యంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు కట్ల సదానంద ముదిరాజ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ బబ్బులు, మహిళా అధ్యక్షురాలు దండురాణి, తెలంగాణ రాజ్యాధికార పార్టీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వెంపటి అజయ్ తదితరులు పాల్గొని మృతురాలికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.
