బీఆర్ఎస్ ది ద్వంద్వ వైఖరి
కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పైడి మల్ల నర్సింగ్ రావు
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ : బీఆర్ఎస్ నాయకుల అవకాశవాద రాజకీయాలపై కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పైడి మల్ల నర్సింగ్ రావు తీవ్రస్థాయిలోమండిపడ్డారు. బుధవారం క్యాతన్‌పల్లి కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఎస్సీ సెల్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకుడు రాజా రమేష్‌పై నిప్పులు చెరిగారు. “ఒకప్పుడు కాంగ్రెస్ బి ఫారం కోసం తిరిగిన రోజులు మర్చిపోయారు. పదవులు అనుభవించి ఇప్పుడు మతి స్థిమితం లేకుండా కాంగ్రెస్ నాయకులపై బురద జల్లడం సిగ్గుచేటు” అని ధ్వజమెత్తారు.కల్వకుంట్ల కుటుంబ పాలనపై కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “కల్వకుంట్ల కుటుంబ సభ్యుల నిజస్వరూపం ప్రజలకు ఇప్పటికే అర్థమైంది. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు నీతులు చెబుతున్నారు” అని విమర్శించారు.
ఎస్సీల సంక్షేమమే అభివృద్ధి దిశగా జిల్లా నుంచి గ్రామ స్థాయి వరకు ఎస్సీ సెల్‌ను మరింత బలోపేతం చేస్తామని ప్రకటించారు. “ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల సంక్షేమం, పార్టీని గడ్డు స్థాయి నుంచి నిర్మించడమే కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం. టిఆర్ఎస్ చేసిన మోసాలను ప్రతి గడపకు తీసుకెళ్తాం” అని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు వడ్నాల శ్రీనివాస్, దామక రమేష్, పాముల వెంకటేష్, నేరెల్లి చంద్రయ్య, పుల్లూరి కళ్యాణ్, నక్క శ్రీనివాస్, పలువురు మండల, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
