జిల్లా ఆసుపత్రికి కొత్త సూపరింటెండెంట్
బాధ్యతలు చేపట్టిన డాక్టర్ వెంకటరత్నం
భూపాలపల్లి రూరల్ (ఆంధ్రప్రభ): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకటరత్నం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, వివిధ విభాగాల ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం డాక్టర్ వెంకటరత్నం మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అందరూ సమష్టిగా కృషి చేయాలని సూచించారు. విధుల నిర్వహణలో బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావం పాటించాలని సిబ్బందికి సూచించారు. ఆసుపత్రిపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా వైద్య సేవల నాణ్యత, పరిశుభ్రత, సమయపాలన, సిబ్బంది సమన్వయంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సింగ్ అధికారులు, పారామెడికల్ సిబ్బంది, ఆసుపత్రి ఉద్యోగులు పాల్గొన్నారు.
