మండల అభివృద్ధే లక్ష్యం: ఇంచార్జ్ ఎంపీడీవో వనజ
అవనిగడ్డ (ఆంధ్రప్రభ) : అవనిగడ్డ మండల పరిషత్ ఇంచార్జ్ ఎంపీడీవోగా మోటేపల్లి వనజ బుధవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఎంపీడీవో మరియకుమారి పదవీ విరమణ చేయడంతో ఖాళీ అయిన ఈ పదవిలో వనజను నియమించారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన ఇంచార్జ్ ఎంపీడీవో మోటేపల్లి వనజను అవనిగడ్డ ఎంపీపీ తుంగల సుమతి, ఎంపీటీసీ సభ్యులు వర్రే నరేష్, బొప్పన భాను తదితరులు పూలమాలలు, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీపీ తుంగల సుమతి మాట్లాడుతూ, మండల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
నూతన ఇంచార్జ్ ఎంపీడీవో మోటేపల్లి వనజ మాట్లాడుతూ, మండలంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
