తల్లికి వందనం.. మరో అవకాశం

  • ఫిర్యాదుల గడువు ఆగస్టు 7 వరకు పొడిగింపు
  • అర్హత, అనర్హత, వివరాల సవరణలకు ఛాన్స్
  • కార్యాలయాల్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచన

విజయవాడ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకానికి సంబంధించి అర్హత, అనర్హత, వివరాల సవరణ తదితర అంశాలపై ఫిర్యాదులు స్వీకరించే గడువును ఆగస్టు 7 వరకు పొడిగించినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ తెలిపారు. అర్హులైన తల్లిదండ్రులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పథకం జాబితాలో పేరు లేకపోవడం, వ్యక్తిగత వివరాల్లో పొరపాట్లు ఉండడం, అనర్హులుగా నమోదవడం లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నవారు తమకు కేటాయించిన స్వర్ణ గ్రామం,స్వర్ణ వార్డు కార్యాలయాలను సంప్రదించి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

ఇప్పటివరకు ఫిర్యాదు నమోదు చేయని అర్హులైన లబ్ధిదారులు కూడా గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అందిన ప్రతి ఫిర్యాదును ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిశీలించి, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా తగిన నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు. ప్రజలు ఆగస్టు 7లోపు సంబంధిత ఎస్‌జీఎస్‌డబ్ల్యూ కార్యాలయాల్లో ఫిర్యాదులు సమర్పించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.