TG | రేపు శతాబ్ధి ముగింపు ఉత్సవాలు

TG | రేపు శతాబ్ధి ముగింపు ఉత్సవాలు
TG | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించడబడి నేటికి వందేళ్లు పూర్తి చేసుకుంది. ఈ యూనివర్సిటీ 1926 ఏప్రిల్ 26న స్థాపించబడింది. చారిత్రక శతాబ్ది ఉత్సవాలు 2025 ఏప్రిల్ నుంచి ప్రారంభమై నేటితో ఘనంగా ముగిశాయి. రేపు ఏయూ శతాబ్ధి ముగింపు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏయూలోని ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో భారీ ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలకు ఉపరాష్ర్టపతి సీపీ రాధాకృష్ణన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ , ఏపీ సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఏయూని ప్రపంచ స్థాయిలో నిలిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఏయూ వ్యవస్థాపక వైస్-ఛాన్సలర్ కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి నివాళులర్పించి, వర్సిటీ భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించి వేడుకలు నిర్వహించారు.
నోబెల్ గ్రహీతల నుంచి రాష్ట్రపతుల వరకు, ఎందరో ప్రముఖులను దేశానికి అందించిన అక్షరాల గనిగా ఈ విశ్వవిద్యాలయం పేరుగాంచింది. ఈ విశ్వవిద్యాలయం NAAC ‘A++’ గ్రేడ్‌తో, దేశంలోని అత్యంత పురాతన మరియు ప్రసిద్ధ ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలిచింది. ఏయూను 1926 ఏప్రిల్ 26న బెజవాడలో ఏర్పాటు చేసి అనంతరం 1930లో విశాఖ పట్నానికి తరలించారు.
