ఘనంగా వాసవి మాత జయంతి..

నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అధికారిక పండుగగా గుర్తించిన నేపథ్యంలో నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం వేడుకలను నిర్వహించారు.
కలెక్టర్ కార్యాలయ అధికారుల ఆదేశాల మేరకు అధికారి సీతారాం నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఆర్యవైశ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కలెక్టర్ కార్యాలయం తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు.
