PressMeet | పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్..

PressMeet | పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్..
హైదరాబాద్‌లోని తన నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించిన జనసేనాని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో, తెలంగాణ గడ్డపై నన్ను అడుగు పెట్టనివ్వం అనడానికి అసలు మీరెవరు? తెలంగాణ ఏమైనా మీ అయ్య జాగీరా? అంటూ జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆనాడు ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తనను అడ్డుకోవాలని చూస్తే.. తనకు అండగా నిలబడింది, గుండెల్లో పెట్టుకుంది తన తెలంగాణ అన్నదమ్ములేనని ఆయన గుర్తుచేశారు. అలాంటి తెలంగాణ ప్రజలపై, ఈ గడ్డపై నాకు వ్యతిరేకత ఎందుకుంటుంది? అని ప్రశ్నించారు.
రాబోయే జీహెచ్ఎంసీ (GHMC) ఎన్నికలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తూ.. రాబోయే గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గనుక ఒంటరిగా బరిలోకి దిగితే.. జనసేన కూడా ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు పవన్. తెలంగాణలో జనసేన జెండా కచ్చితంగా ఎగురుతుంది. నేనే స్వయంగా ఇక్కడి గల్లీ గల్లీల్లో తిరుగుతా.. ప్రతి ప్రజా సమస్యపై గళమెత్తుతా.. జరిగే ప్రతి అన్యాయాన్ని నిలదీస్తా! ఎందుకంటే తెలంగాణ ఈ భారతదేశంలో అంతర్భాగం.. ఇక్కడ ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది అని స్పష్టం చేశారు.
తెలంగాణతో తనకున్న దశాబ్దాల బంధాన్ని గుర్తుచేస్తూ..
ఈ రోజుల్లో కొందరికి ఎన్నికలు రాగానే తెలంగాణపై కొత్తగా ప్రేమ పుట్టుకొస్తుంది.. కానీ నాది ఆ టైప్ కాదు. దశాబ్దాలుగా నాతో ప్రయాణిస్తూ, నా చుట్టూ ఉన్న నాయకులంతా తెలంగాణ బిడ్డలే. తెలంగాణ సంస్కృతి, ఇక్కడి సంప్రదాయాలు, ఇక్కడి విప్లవాత్మక సాహిత్యం, పోరాట స్ఫూర్తిని గుండెల్లో నింపుకుని, వాటినే నా ఆదర్శంగా తీసుకుని నడుస్తున్న వాడిని నేను… అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగంగా, అంతే పవర్‌ఫుల్‌గా మాట్లాడారు.
