Wedding Muhurtham 2026 | ఈ నెల 19 వ తేది నుంచి 30 వ‌ర‌కు ముహుర్తాలు

Wedding Muhurtham 2026 | ఈ నెల 19 వ తేది నుంచి 30 వ‌ర‌కు ముహుర్తాలు

Wedding Muhurtham 2026 | జులై, ఆగ‌స్ట్ నెల‌లోనూ శుభ ఘ‌డియాలు
ప‌చ్చ‌తోర‌ణాల‌కు సిద్ద‌మవుతున్న కుటుంబాలు
ఎపి, తెలంగాణ‌లో వివాహ వేడుకల స‌న్నాహాలు
ఇక క‌ళ‌క‌ళ‌లాడ‌నున్న పెళ్లి మండ‌పాలు, వాణిజ్య స‌ముదాయాలు

Wedding Muhurtham 2026 | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భః గ‌త నెల రోజులుగా ఏపీ, తెలంగాణ‌లో ఎక్క‌డ పెళ్లి భాజాలు వినిపించ‌లేదు.. ఈ సారి ఫిబ్రవరి నుంచి ఊపందుకున్న వివాహాలు మే 13 నుంచి ఒక్కసారిగా ఆగిపోయాయి. మధ్యలో అధిక జ్యేష్టం రావడమే దానికి కారణం. దాంతో పెళ్ళిళ్ల‌ సీజన్ కి సంబంధించిన మార్కెట్ అంతా కూడా ఆగిపోయింది. బ్యాండ్ మేళాలతో పాటు పురోహితులు సైతం ఖాళీ అయిపోయారు. అలాగే పెళ్ళిళ్ల కోసం నిర్మించిన కళ్యాణ మండపాలూ బోసిపోయాయి. ఇపుడు మళ్లీ ఒక పదిహేను రోజుల పాటు వాటికి కళ రానుందని అంటున్నారు పండితులు.

19 నుంచి మంచి ముహుర్తాలు..
తాజాగా ఈ నెల మంచి రోజులు వచ్చాయి. శుభ కార్యక్రమాలకు మ‌ళ్లీ ముహూర్తలు సిద్ధంగా ఉన్నాయి . నిజ జ్యేష్ఠ మాస అన్నది జూన్ 15 నుంచి మొదలవుతోంది. దాంతో జూన్ లో ఎక్కువగానే శుభ కార్యక్రమాలకు ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. జూన్ నెలలో 19 నుంచి 30 వరకు పెళ్లిళ్లకు అనువైన రోజులు ఉన్నట్లు పండితులు చెబుతున్నారు. 21, 22, 23, 24, 25, 26, 27, 29 రోజులలో పెళ్ళిళ్ల‌కు మంచి ముహూర్త బలం అని పండితులు పేర్కొంటున్నారు.

జులై, ఆగ‌స్ట్ లో కూడా..
ఇక జులైలో కొన్ని రోజులే ఉన్నాయని తెలుస్తోంది. అవి , 1, 2, 6, 7, 8, 11 తేదీలుగా పండితులు పేర్కొంటున్నారు. ఈ తేదీలు మాత్రమే వివాహాది శుభకార్యాలకు అనుకూలమని వెల్లడిస్తున్నారు. తర్వాత ఆగస్టులో 16, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 తేదీలలోనూ మంచి ముహూర్తాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఈ ఏడాది చివరిలో చూస్తే కనుక నవంబర్ లో 21, 24, 25, 26 తేదీలు డిసెంబర్ లో 2, 3, 4, 5, 6, 11, 12 తేదీలు మంచి ముహూర్తం కలిగిన వివాహ ఘడియలుగా చెబుతున్నారు.

ఇక ఊపందుకోనున్న వ్యాపారం
ఇక‌ దేశంలో పెళ్ళిళ్ల‌ సీజన్ అన్నది అతి పెద్ద మార్కెట్ గానే అంతా చూస్తారు. ఎక్కడ లేని డిమాండ్ తో ఈ మార్కెట్ నడుస్తుంది. దేశ ఆర్ధిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెళ్ళిళ్ల‌ సీజన్ ఉంటుంది. అలాంటిది మళ్లీ మొదలు కానుండడంతో అన్ని వర్గాల్లో ఆనందం అయితే కనిపిస్తోంది. మరి ముందే ముహూర్తాలను నిర్ణయించుకున్న వారు అంతా పెళ్ళిళ్ల‌ కోసం తయారు కావాల్సిన శుభ తరుణం వచ్చినట్లే అని అంటున్నారు.

డిమాండ్-సప్లై
ఏపీ, తెలంగాణ వ్యాపారులు ఈ పెళ్లిళ్ల సీజన్​ను క్యాష్ చేసుకునేందుకు భారీ ఎత్తున వివాహ సంబంధిత వస్తువులను నిల్వ చేసుకుంటున్నారు. కస్టమర్ల డిమాండ్​కు ఏమాత్రం సప్లై తగ్గకుండా చూసుకుంటున్నారు. వాస్తవానికి ప్రతి వివాహం కోసం కేటాయించిన బడ్జెట్‌లో వధూవరులకు కలిపి 20 శాతం ఖర్చు అవుతుంది. మిగతా 80 శాతం డబ్బును పెళ్లి ఏర్పాట్లు చేసే థర్డ్-పార్టీ వారికి వెళ్లిపోతుంది.

పెళ్లి ఖర్చులు .
పెళ్లిళ్ల విషయానికి వస్తే, వివాహం కోసం బంగారం, నగలు, వజ్రాల హారాలు, చీరలు, దుస్తులు, లెహంగా-చోళీ, ఫర్నీచర్​, పెళ్లికార్డులు, డ్రైఫ్రూట్స్​, స్వీట్స్​, పళ్లు, పూజా వస్తువులు, కిరాణా సామగ్రి, అలంకరణ వస్తువులు, గృహాలంకరణ సామగ్రి, విద్యుత్ పరికరాలు, ఎలక్ట్రానిక్స్​, వివిధ రకాల బహుమతులు, ఆహార పదార్థాలు, ఆహార ధాన్యాలు ఇలా చెప్పుకుంటూపోతే, లెక్కలేని వస్తువులు కొంటూ ఉంటారు. కనుక భారీ ఎత్తున వ్యాపారం జరుగుతుంది.

వివాహ వేదికలు
వివాహ వేడుకల కోసం పెద్దపెద్ద పెళ్లి మండపాలు, హోటళ్లు, బాంక్వెట్​ (విందు) హాళ్లు , ఓపెన్ లాన్​లు, కమ్యూనిటీ సెంటర్లు, పబ్లిక్ పార్కులు, ఫామ్​హౌస్​లు ఇలా అనేక రకాల వివాహ వేదికలు బుక్ చేస్తారు. వీటితోపాటు టెంట్ డెకరేటర్లు, ఫ్లవర్​ డెకరేషన్లు, మందుగుండు సామగ్రి (క్రాకర్స్​) తీసుకుంటారు. కనుక ఇక్కడా భారీ ఎత్తున బిజినెస్ జరుగుతుంది.

వెడ్డింగ్ సర్వీసెస్​
పెళ్లి కోసం ఈవెంట్ మేనేజ్​మెంట్​, ప్యాకేజింగ్​, క్యాటరింగ్, ట్రావెల్ సర్వీసెస్​, క్యాబ్ సర్వీసెస్ బుక్​ చేసుకుంటాం. ప్రొఫెషనల్ వెల్​కమ్​ గ్రూప్​లు, ఫొటోగ్రాఫర్​లు, వీడియోగ్రాఫర్​లు, బ్యాండ్లు, మ్యూజీషియన్స్​ లాంటి వారిని కూడా బుక్ చేసుకుంటాం. అలాగే డీజే, పెళ్లి ఊరేగింపు కోసం గుర్రాలు, క్యారేజీలు, లైటింగ్​ ఇలా చాలా సర్వీసులను హైర్ చేసుకుంటాం. కనుక ఈ సర్వీస్ సెక్టార్లకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా సేవల రంగంలో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. దీంతో పెళ్లిళ్ల సీజ‌న్ సైతం దేశ ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంద‌ని ఆర్థికవేత్త‌లు అంటున్నారు..