సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం..

సమసమాజ దిశగా అంబేద్కర్ మార్గం..
అంబేద్కర్ ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలి: సారంగపాణి
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీఆర్‌ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వహించి, కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.నల్లబెల్లి బస్‌స్టాండ్ ఆవరణతో పాటు నారక్కపేట జాతీయ రహదారి–365పై ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు,ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి నాయకత్వం వహించారు. అనంతరం నల్లబెల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ నాగెల్లి జ్యోతి ప్రకాశ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సారంగపాణి మాట్లాడుతూ,అంబేద్కర్ సమసమాజ నిర్మాణానికి కృషి చేసిన మహానుభావుడని కొనియాడారు.

ఆయన ఆలోచనలను గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు,దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ముఖ్యంగా అంబేద్కర్ అభయ హస్తం పథకాన్ని వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు,ఇదే సందర్భంగా నారక్కపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటి ట్యాంకర్ వాహనాన్ని సర్పంచ్ దండెం సంపత్‌తో కలిసి ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్,మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఊడుగుల ప్రవీణ్ గౌడ్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి కోటిలింగ చారి,క్లస్టర్ ఇన్‌చార్జి గందే శ్రీనివాస్ గుప్తా,ఉప సర్పంచ్ గుమ్మడి వేణు,గ్రామ నాయకులు,యువ నాయకులు మరియు బీఆర్‌ఎస్ మండల,గ్రామ స్థాయి ముఖ్య నాయకులు పాల్గొన్నారు
