Union Minister | డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం

Union Minister | డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వితండవాదం

Union Minister | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. డీలిమిటేషన్ అంశంపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు.

డీలిమిటేషన్ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గతంలో డీలిమిటేషన్‌ను జనాభా ప్రాతిపదికన అమలు చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ నేతలే వాదించారని ఆయన గుర్తు చేశారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రంలో సుమారు 50శాతం సీట్ల పెంపు దిశగా ముందుకు వెళ్తున్నప్పటికీ, అదే అంశంపై కాంగ్రెస్ పార్టీ వితండవాదం చేస్తోందని విమర్శించారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తెలుగు ప్రజలను తక్కువగా చూసిందని ఆరోపించిన కిషన్ రెడ్డి, రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ వివాదాన్ని సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply